counter customizable free hit The Devil’s Chair Review: A Spine Chilling Thriller (Rating: 3.25) – Curefym

The Devil’s Chair Review: A Spine Chilling Thriller (Rating: 3.25)

The Devil's Chair Review: A Spine Chilling Thriller (Rating: 3.25)

అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై . కె కె చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. డెబ్యూ దర్శకడు గంగ సప్తశిఖర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ రోజే వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం భయపెట్టి థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: విక్రమ్(అదిరే అభి) జూదానికి బానిసై తను పనిచేస్తున్న కంపెనీలోని కోటి రూపాయలు కొట్టేసి బెట్టింగ్ ఆడతాడు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆయన డబ్బు మొత్తం బెట్టింగ్ లో పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు… లీగల్ గా కేసులో ఇరుక్కుంటాడు. అతనికి రుధిర(స్వాతి మండల్) అనే ఎయిర్ హోస్టెస్ ప్రియురాలు వుంటంది. విక్రమ్ కి ఉద్యోగం పోవడంతో తనే ఆర్థికంగా ఆదుకుంటూ… తన బాగోగులు చూస్తూ వుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకునే క్రమంలో విక్రమ్ ను ఏదైనా జాబ్ చూసుకో అని ఒత్తిడి తెస్తూ వుంటుంది. అదే సమయంలో తను కొట్టేసిన కోటి రూపాయలను వెంటనే కట్టాలని కంపెనీ యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది. అదే సమయంలో రుధిర ఒక యాంటిక్ చైర్ ను ఎంతో ఇష్టపడి కొని తెచ్చుకుని ఇంట్లో పెడుతుంది. ఆ చైర్ వల్ల అభికి కావాల్సినప్పుడల్లా డబ్బులు వచ్చి పడుతుంటాయి. ఈ డబ్బులతో విక్రమ్ తన ప్రియురాలి చిన్న చిన్న సరదాలు తీర్చడంతో పాటు తన జల్సాలు కూడా చేస్తూ ఎంజాయ్ చేసేస్తుంటాడు. అయితే రూ.5 కోట్ల రూపాయలు ఇస్తా… నీ ప్రియురాలని చంపేయాలని ఆ చైర్ కు ఒక డెవిల్ శక్తి ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్… రూ.5కోట్ల కోసం తన ప్రియురాలని చంపాడా? అసలు ఆ చైర్ లో ఉన్నది ఎవరు? అది విక్రమ్ ను ఎలా తన వశం చేసుకోవడడానికి ప్రయత్నిస్తుంది? ఆ చైర్ వెనుక వున్న బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: ఎంత పెద్ద సినిమా అయినా కథలో బలం లేకపోతే ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం చలా కష్టం. కంటెంటే సినిమాకి బలం. అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుంటున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి బలమైన కథ… కథనాలతో తెరకెక్కిన చిత్రమే ‘ది డెవిల్స్ చైర్’. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అణువణువునా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది. అన్ని భాషలకు యాప్ట్‌ గా ఉంటుందనే ఉద్దేశంతో ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ ను ఎంపిక చేసి చిత్ర యూనిట్ మంచి పని చేసింది. మనిషికి ఉండే దురాశ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. మంచి కాన్సెప్ట్‌ తో పాటు మంచి సందేశం కూడా ఇచ్చారు. చిత్రం అందరినీ ఓ వైపు భయపెట్టేలా ఉన్నా… దురాశ దు:ఖానికి చేటు అనేది చూపించారు. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు గంగ సప్తశిఖర వందశాతం సక్సెస్ సాధించాడు అనే చెప్పొచ్చు. రచయిత దర్శకుడిగా గంగ సప్తశిఖర ‘ది డెవిల్స్ చైర్’ చిన్న బడ్జెట్ లో అనుకున్నది అనుకున్నట్టుగా తీసాడు . కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరినీ ఈ సినిమా హంట్ చేస్తుంది. మంచి కంటెంట్‌ వున్న సినిమా ఇది. కావాల్సినంత డ్రామా, వినోదం పంచుతుంది. గో అండ్ వాచ్ ఇట్.

జబర్దస్త్ షోతో అదిరే అభిగా పరిచయమై మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా అటు బుల్లితెరపైనా… ఇటు వెండితెరపైనా కనిపిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. ఎంతో క్రమశిక్షణతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న అభి… ది డెవిల్స్ చైర్ లో ఈజీ మనీకి అలవాటు పడిన ఓ దురాశకలిగిన వ్యక్తి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. రెండు మూడు వేరియషన్స్ లో అభి అభినయం అందిరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు మనోజవ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి, పుండాక్ష పాత్రలో చంద్ర సుబ్బగారి, నూర్జహాన్ గా మూగమ్మాయిగా అద్విత చౌదరి నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు గంగ సప్త శిఖర తొలి సినిమానే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఎంచుకుని గొప్ప సాహసమే చేశాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. ప్రయోగాత్మక చిత్రంతోనే తొలి అడుగు వేసి విజయం సాధించారనే చెప్పొచ్చు. సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్‌ జోన్‌లో ఉండేందుకు ట్రెండింగ్‌ సబ్జెక్ట్‌ ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతారు డెబ్యూ దర్శకులు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఈ హారర్‌ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించి… కాన్సెప్ట్‌ తో పాటు మేకింగ్‌ కూడా డిఫరెంట్‌గా చేశారు. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్‌ ఫిలిమ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. లిమిటెడ్ బడ్జెట్‌లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ది డెవిల్స్‌ చైర్‌’ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా ఓ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రంతో పాటు W/O అనిర్వేష్ చిత్రానికి కూడా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఇంకా మంచి ప్యాడింగ్ ఉంటే సినిమా రేంజ్ మరింత పెరిగి వుండేది. ఈ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

రేటింగ్: 3.25

The Devil's Chair Review: A Spine Chilling Thriller (Rating: 3.25)

The post The Devil’s Chair Review: A Spine Chilling Thriller (Rating: 3.25) appeared first on Social News XYZ.

About admin